టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరిన సీఎం విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరింది న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలోని టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్బంగా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరారు టీవీకే పార్టీ చీఫ్ , సీఎం. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు వీసీకే పార్టీ చీఫ్ , ఎంపీ థోల్ తిరుమాల‌వ‌న్.
రాష్ట్ర మంత్రివర్గంలో VCK చేరాలంటూ ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ ఇచ్చిన ఆహ్వానంపై త‌ను స్పందించాడు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగినప్పుడు, పార్టీ మంత్రివర్గంలో భాగం కావాలనే అభిప్రాయాన్ని చాలా మంది సభ్యులు వ్యక్తం చేశారు. అయితే చివరగా మేము బేషరతు మద్దతును అందించడం జ‌రిగింద‌న్నారు.

టీవీకే నుండి వచ్చిన ఆహ్వానాన్ని మేము గౌరవిస్తామ‌ని అన్నారు పార్టీ చీఫ్‌. ఇప్పుడు వారు మమ్మల్ని మంత్రివర్గంలో చేరమని మరోసారి ఆహ్వానిస్తున్నారు. మేము పార్టీ కార్యకర్తలతో చర్చించి, మా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. . విజయ్ VCK కార్యాలయానికి వచ్చినప్పుడు తాము కూడా మంత్రివర్గంలో భాగం కావాలని ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారని చెప్పారు. తమిళగ వెట్రి కజగం కూటమిలో భాగమయ్యే పరిస్థితి మాకు ఏర్పడ లేద‌న్నారు. అందుకే మేము DMK కూటమితోనే మా ప్రయాణాన్ని కొనసాగించామన్నారు. ఈ చర్చల కోసం మళ్ళీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.

  • Related Posts

    ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల కేంద్రంగా తెలంగాణ : సీఎం

    హైద‌రాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో…

    రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన జ‌ర్న‌లిస్టులు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధ‌వారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *