జూనియ‌ర్ ఎన్టీఆర్ డ్రాగ‌న్ టీజ‌ర్ కెవ్వు కేక

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్

హైద‌రాబాద్ : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం డ్రాగ‌న్. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు . దీంతో ఈసినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మూవీ మేక‌ర్స్ తార‌క్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుష్ క‌లిగించేలా టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ , అనిల్ కపూర్ , మ‌రో కీల‌క న‌టి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. య‌శ్ కేజీఎఫ్‌, ప్ర‌భాస్ స‌లార్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ డ్రాగ‌న్. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌రోసారి త‌న మార్క్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ప్ర‌శాంత్ నీల్.

ఈ ప్రాజెక్ట్‌ను చాలా నెలలుగా ఎన్టీఆర్ నీల్ అని పిలిచారు. కానీ ఇవాళ విడుద‌లైన టీజ‌ర్ లో డ్రాగ‌న్ మూవీ పేరు ఖ‌రారు చేశారు. దీంతో అనుమానాల‌కు తెర ప‌డింది. దీంతో పండుగ చేసుకుంటున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మే 20న అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు ఈ టీజర్‌ను విడుదల చేశారు. మ‌రో వైపు డ్రాగన్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఈ వీడియోలో “లూగర్” అనే ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. అలాగే, 1960ల నాటి గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం , నల్లమందు వ్యాపారం నేపథ్యంలో సాగే సన్నివేశాలను చూపించారు. ఈ టీజర్‌లో నటులు అనిల్ కపూర్, బిజు మీనన్ , రుక్మిణి వసంత్ కూడా ఉన్నారు.

  • Related Posts

    ఆ న‌టుల‌తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వం

    చెన్నై : అందాల ముద్దుగుమ్మ‌గా పేరు పొందిన వ‌ర్ద‌మాన న‌టి న‌మిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఎంద‌రో న‌టుల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా త‌ను న‌టించిన న‌టుల‌లో ఎవ‌రు త‌న‌కు బాగా నచ్చార‌నే విష‌యాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్…

    గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *