Friday, 16 October 2026

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

newsseals-APCM

శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ పై సీఎం చంద్ర‌బాబు

బెంగ‌ళూరు : శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోను అవుతోందన్నారు. గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాల్సిన అవశ్యకత ఉందన్నారు సీఎం.

ఇలాంటి సమయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు మానవాళికి అత్యు్త్తమ సేవలు అందించాలని కోరారు సీఎం. ప్రధాని మోదీ లాంటి సమర్ధవంతమైన నేత దేశానికి నేతృత్వం వహిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా భారత్ అగ్రగామిగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వేల ఏళ్ల క్రితం వరకూ మానవాళిని నడిపించిన నేల ఇది. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన దేశం మనది అని గుర్తు చేశారు. ఆధునిక జీవనంలో శాంతిని సాధించేలా శ్రీ రవిశంకర్ గురూజీ తన బోధనలతో ప్రభావితం చేశారన్నారు చంద్ర‌బాబు నాయుడు. సంస్కృతితో మిళితమైన ఆధునికత, విలువలతో కూడిన జీవనం లాంటి ఎన్నో అంశాల ద్వారా తన బోధనల్ని సాగిస్తున్నారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *