తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

ప్ర‌మాణ స్వీకారం చేసిన వ‌న్ని అర‌సు, షాజ‌హాన్
చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇప్ప‌టికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇంకో ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీల‌ను కూడా కేబినెట్ లో చేరాల‌ని కోరారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

ఆయ‌న కోరిక‌ను మ‌న్నించాయి ఆయా పార్టీలు. ఈ మేర‌కు కీల‌క స‌మావేశం నిర్వ‌హించి తాము కూడా కేబినెట్ లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ప్రధాన సచివాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రాజేష్ కుమార్ , పి. విశ్వనాథన్, విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఏ.ఎం.ఎం. షాజహాన్ క‌లిశారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం విజ‌య్.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *