జోఫ్రా ఆర్చ‌ర్ ఆల్ రౌండ్ షో అదుర్స్

ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్

ముంబై : ఐపీఎల్ 19వ మెగా టోర్నమెంట్ లో కీల‌క‌మైన స‌మ‌యంలో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని ఆ జ‌ట్టు అన్ని విభాగాల‌లో రాణించింది. స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్ము రేపింది. స్వంత గ‌డ్డ‌పై ముంబై ఇండియ‌న్స్ ను మ‌ట్టి క‌రిపించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 206 ప‌రుగుల భారీ స్కోర్ ముందుంచింది. అనంత‌రం టార్గెట్ ను ఛేదించ‌లేక చేతులెత్తేసింది ముంబై ఇండియ‌న్స్ 169 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

ప్ర‌ధానంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకున్నాడు. ఆఖ‌రున వ‌చ్చిన త‌ను కీల‌క‌మైన 32 ర‌న్స్ చేశాడు. ఆపై క‌ళ్లు చెదిరే బంతుల‌తో బెంబేలెత్తించాడు ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ల‌ను. త‌ను 4 ఓవ‌ర్లు వేసి కేవ‌లం 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన మూడు వికెట్లు పడ‌గొట్టాడు. దీంతో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సూప‌ర్ షో చేసిన జోఫ్రా ఆర్చ‌ర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఈ టోర్నీలో సిక్స‌ర్ల మోత మోగిస్తూ వ‌చ్చిన వైభ‌వ్ సూర్య వంశీ ఉన్న‌ట్టుండి కేవ‌లం 4 ప‌రుగుల‌కే విల్ జాక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *