తప్పదంటున్న జట్టు మేనేజ్మెంట్ ,జట్టు చైర్మన్
లక్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంతగా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయర్లకు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది రిషబ్ పంత్ గురించి. తను గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. తనను ఎవరూ ఊహించని ధరకు కొనుగోలు చేసింది యాజమాన్యం. కానీ ఆశించిన మేర రాణించలేదు. పేలవమైన పర్ ఫార్మెన్స్ తో పాటు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించలేక పోయాడు. అటు బ్యాటింగ్ లో ఇటు నాయకత్వంలో పూర్ ఫర్ ఫార్మెన్స్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం. ఇక ఈసారి ఐపీఎల్ లో ఆయా జట్ల పరంగా చూస్తే రిషబ్ పంత్ తో పాటు మరో కీలక ఆటగాడు కూడా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగనున్నట్లు సమాచారం.
అతను ఎవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఆ జట్టులో కొత్తగా చేరిన సంజు శాంసన్ సైతం ఆశించిన మేర రాణించలేక పోయాడు. ఇక తాజాగా ఐపీఎల్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం జరిగే వేలంపాటలో రిషబ్ పంత్ ను తమ జట్టు నుంచి విడుదల అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ యజమాని కావడంతో పంత్ డీసీకి తిరిగి వెళ్ళవచ్చు. ఎల్‌ఎస్‌జిలో, పంత్ గానీ లేదా టామ్ మూడీ, జస్టిన్ లాంగర్ గానీ నిష్క్రమించనున్నట్లు టాక్. మరో వైపు ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి హార్దిక్ పాండ్యాను కూడా తొలగించనున్నారు.







