Friday, 16 October 2026

టిడిపిలో కార్యకర్తే అధినేత : నారా లోకేష్

newsseals-NaraLokesh

క‌ష్ట‌ప‌డిన వారికి త‌ప్ప‌కుండా ప‌ద‌వులు ఇస్తాం

అమ‌రావ‌తి : తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే “జై చంద్రబాబు, జై టిడిపి” అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడి చేస్తే తొడకొట్టి మీసం మెలేశాడు అంజిరెడ్డి తాత. వైసిపి రౌడీల దాడిలో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్ బూత్‌లో కూర్చున్నారు మంజుల . వైసిపి గూండాల దాడిలో కన్నుపోయినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడారు చెన్నుపాటి గాంధీ. వీరంతా మనకు స్ఫూర్తి.

మన అధినేతను 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా రోడ్లపైకి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. కేసులకు వెనకడుగు వేయలేదు, అరెస్టులకు భయపడలేదు. అవతల వైపు ఎవరున్నా మన డైలాగే ఒకటే… తగ్గేదే లే. మనం కొట్టిన దెబ్బకి వై నాట్ 175 కాస్తా టీమ్ 11 అయ్యిందన్నారు. 2024 ఎన్నికల్లో రికార్డులు బద్దలుకొట్టాం. 94% స్ట్రైక్ రేట్…164 సీట్లు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు… ప్రజా ప్రభుత్వాన్ని పెద్దఎత్తున ప్రజలు ఆశీర్వదించారు. అన్ని రికార్డులు బద్దలు కొట్టాం. శ్రీకాకుళంలో 10కి పది, విజయనగరంలో 9కి 9, తూర్పుగోదావరిలో 19కి 19, పశ్చిమ గోదావరిలో 15కి 15, కృష్ణాలో 16కి 16, గుంటూరులో 17కి 17, నెల్లూరులో 10కి 10, అనంతపురంలో 14కి 14.. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్. కడపలో కూడా 10కి 7 గెలిచాం. ప్రభుత్వం సూపర్ హిట్… సైకో టీమ్ -11. ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎవరూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *