క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభం : స‌దానంద గౌడ‌

Spread the love

సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య వార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయ‌కంగా మారింది. నిన్న‌టి దాకా ఊరిస్తూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్ హైక‌మాండ్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌స్తుతం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న సిద్ద‌రామ‌య్య‌ను త‌ప్పించింది. త‌న‌ను రాజీనామా చేయాల‌ని కోరింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. గ‌త కొంత కాలంగా ఆధిపత్య పోరు కొన‌సాగుతూ వ‌స్తోంది సీఎం, డిప్యూటీ సీఎంల మ‌ధ్య‌. దీంతో చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో డీకే శివ‌కుమార్ కు ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు అప్పించింది పార్టీ అధిష్టానం. ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స్పందించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు డి. వి. సదానంద గౌడ .

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. .అన్నీ సజావుగా సాగడం లేదు. కేంద్ర నాయకులు, సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ, వారు తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలియ జేయబడలేదని అన్నారు. అయితే, సిద్ధరామయ్య ఈ రోజే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు, వ్యక్తిగత కారణాల రీత్యా గవర్నర్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరన్నారు స‌దానంద గౌడ‌. ఈ అధికార మార్పిడి ప్రక్రియలో ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని డి.కె. శివకుమార్‌కు అప్పగించే ప్రక్రియ సజావుగా సాగడం లేదని అనుమానం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    అరుదైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య : భ‌వ్య మూర్తి

    Spread the love

    Spread the loveరాజ‌కీయాల‌లో ఇలాంటి నేత‌లు చాలా అరుదు బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌ప్పుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ నాయ‌కురాలు భ‌వ్య న‌ర‌సింహ మూర్తి.…

    క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా

    Spread the love

    Spread the loveవిధానసౌధలో రాజీనామా లేఖను సమర్పించిన సీఎం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న గురువారం విధాన సౌధ‌లో రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ ప‌ని మీద మ‌రాఠాకు వెళ్లారు. దీంతో విధాన‌స‌భ‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *