104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు


పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా ఇవ్వ‌డం ప‌ట్ల విద్యార్థులు ఆనందం వ్య‌క్తం చేశారు.. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు ఇచ్చారు.

తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు .అత్యుమ్మ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంతంగా రూ.లక్ష నగదు, 200 స్కూల్ బ్యాగ్ లను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ లో, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.లక్ష లను మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *