6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌

VijayaBhaskar · June 4, 2026
Spread the love

ప్ర‌క‌టించిన సంస్థ ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ). ఇది ప్ర‌స్తుతం అమెరికా వేదిక‌గా ఆన్ లైన్ వేదిక‌గా ఏర్పాటైంది. మిలియ‌న్ల కొద్దీ జ‌నం దీనిని అనుస‌రిస్తున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప్ర‌తినిధిగా ప్ర‌ముఖ ప‌రిశోధనాత్మ‌క జ‌ర్న‌లిస్టుగా పేరు పొందిన సౌర‌వ్ దాస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టిందన్నారు.ఆన్‌లైన్‌లో పరీక్షల వివాదాల చుట్టూ మొదలైన ఈ ఉద్యమం, ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిజమైన సంస్థగా మారడానికి సిద్ధమవుతోంద‌ని వెల్ల‌డించారు.

CJP తమ అధికారిక ప్రతినిధులను ప్రకటించింది. జూన్ 6న ఢిల్లీలో నిరసన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు సౌర‌వ్ దాస్. .అలాగే తనపై యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ దేశానికి తిరిగి వస్తానని పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే స్పష్టం చేశాడు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమానికి బలమైన రాజకీయ పార్టీలు కూడా స్పందించడం స్టార్ట్‌ చేశాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

అభిజీత్ దిప్కే జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటలకు ఢిల్లీలో దిగుతారు. తన మద్దతుదారులు విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకాలని, వారందరూ కలిసి వాంగ్‌చుక్ జీతో పాటు పార్లమెంట్ స్ట్రీట్‌కు వచ్చి, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారందరిని తాము ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు సౌర‌వ్ దాస్.