ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌పై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చ‌రిత్ర ఎక్క‌డ‌..? ఆంధ్రా చ‌రిత్ర ఎక్క‌డ తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. కావాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఇక్క‌డ ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ముమ్మాటికీ తెలంగాణ మాదేన‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ అన్న ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని బక్క‌ని న‌ర్సిములు చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌కు సోయి అనేది లేద‌న్నారు క‌విత‌. తెలంగాణ మాదేన‌ని, మా జాగీరేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇది పవన్ కల్యాణ్ తాతా ముత్తాతల జాగీరు కాదన్నారు. ఆంధ్రకు చెందిన మీ విషపూరిత పంజా నుండి మిమ్మల్ని కాపాడటానికే మేము తెలంగాణను సాధించుకున్నాం అన్నారు. ఇప్పుడు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడంలో మీకున్న నైతికత ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలి : హైకోర్టు

    హైద‌రాబాద్ : మహిళా BRS ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన నిరసన సమయంలో పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ BRS ఎమ్మెల్యేలు హైకోర్టును…

    సీఈసీ వ్య‌వ‌హారంపై నోరు మెద‌ప‌ని విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు డీఎంకే ఎంపీ క‌నిమొళి. విజయ్‌ను ఉద్దేశించి “ప్రియమైన తమ్ముడు విజయ్” అని పిలిచారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *