మోదీ ప్ర‌భుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రిజైన్ చేయాలి
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప‌రీక్ష‌లుగా భావించే , ల‌క్ష‌లాది మంది భ‌విష్య‌త్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు లీక్ ల కార‌ణంగా ర‌ద్ద‌య్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అధికారంలో ఉన్న బార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కొంద‌రు ఈ లీకుల‌లో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు విద్యార్థులు, బాధితులు, ప్ర‌జాస్వామిక వాదులు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి నిరుద్యోగుల గురించి నోరు పారేసుకున్నారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్.

ఆయ‌న కామెంట్స్ ను నిరసిస్తూ ఆన్ లైన్ వేదిక‌గా అభిజిత్ దిప్కే ఏకంగా బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ ని ప్ర‌క‌టించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. కొన్ని గంట‌ల్లోనే మిలియ‌న్ల కొద్దీ సోష‌ల్ మీడియాలో ఫాలోయ‌ర్స్ పెర‌గ‌డం ప్రారంభించారు. దీంతో సీజేపీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కోరుతూ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ , ప్ర‌జా కార్య‌క‌ర్త సోనం వాంగ్ చుక్. ఆయ‌న‌ను కేంద్రం నానా తిప్ప‌లు పెట్టింది. అనేక ఆరోప‌ణ‌లు చేసింది. పరీక్షలకు సంబంధించిన లోపాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    విప‌క్షాల నినాదాల మ‌ధ్య రాజ్య‌స‌భ వాయిదా

    న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా ప‌డింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *