విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి

తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద బాధితులను పరామర్శించ నున్న‌ట్లు వైసీపీ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *