రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

11వ తేదీ గురువారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఎం కార్యక్రమానికి హాజ‌ర‌వుతారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు ఈ కీల‌క నీతి ఆయోగ్ స‌మావేశంలో. ఇందుకు సంబఃధించి పూర్తి నోట్స్ ను కూడా ఆయ‌న ప్రిపేర్ చేసుకుంటున్నారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *