టెండర్ల గోల్ మాల్ పై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు. ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో చదివి, BHEL ఉద్యోగం వదిలి ‘మన షూస్’ కంపెనీ స్థాపించిన యువకుడికి 300 కోట్ల టర్నోవర్ నిబంధన కారణంగా దరఖాస్తు చేసే అవకాశం కూడా లేక పోవడం దురదృష్టకరం అని అన్నారు. తరతరాలుగా తోలు పరిశ్రమలో ఉన్న వారిని పక్కనబెట్టి, పెద్ద వ్యాపారులకు టెండర్లు కట్టబెట్టడం సామాజిక న్యాయానికి విరుద్ధం అని తీవ్ర స్థాయిలో మండపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అర్హులైన దళిత యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించాలని, టెండర్ విధానంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఉన్నత వర్గాలకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, బడా బాబులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఇది మంచి పద్దతి కాదన్నారు. జరుగుతున్న అన్యాయాలపై తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ.