డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

కీల‌క అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

ఫ్రాన్స్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జి 7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు, అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎవియాన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. త‌న‌ను క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత , ప్రజల మధ్య సంబంధాల రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర పురోగతిని తాము సమీక్షించడం జ‌రిగింద‌న్నారు.

పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలలో సాధిస్తున్న పురోగతి పట్ల భారతదేశం తరపున అభినందనలు తెలియజేశామ‌న్నారు మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం అత్యంత కీలకం అని పేర్కొన్నారు. సముద్రయాన కార్మికులతో సహా పౌరుల భద్రత, రక్షణను నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించామని తెలిపారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *