ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్‌ స్ట్రాంగ్ వార్నింగ్

VijayaBhaskar · June 20, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉపాధ్యక్షుడు

అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఉన్న‌ట్టుండి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధానంగా గ‌త కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేష‌ర‌తుగా , నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తోంది అమెరికా. తాజాగా ఇరాన్ పై మ‌ధ్య ప్రాచ్యంలో ప‌ట్టు సాధించేందుకు అమెరికా ఇజ్రాయెల్ తో క‌లిసి యుద్దానికి తెర తీసింది. చివ‌ర‌కు ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిని ఒప్పందం చేసుకునేంత దాకా వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా త‌న స‌హ‌చ‌ర దేశ‌మైన ఇజ్రాయెల్ దేశాధ్య‌క్షుడు నెత‌న్యాహూకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేర‌కు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడారు.

అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు. త‌మ మ‌ద్ద‌తును తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు. నేనే కనుక ఇజ్రాయెల్‌ కేబినెట్‌లో ఉండిఉంటే, మిత్రదేశం అమెరికాపై విమర్శలు చేసేవాడినే కాద‌న్నారు. ప్రపంచం మిమ్మల్ని అసహించు కుంటోంద‌న్నారు. మీకున్న ఏకైక స్నేహితుడు ట్రంప్ మాత్రమేన‌ని, ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. .నెతన్యాహుపై మండిపడ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అవుతోంది .