డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి ఆస్తులు రూ. 200 కోట్లు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అవినీతి నిరోధ‌క శాఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్క‌రొక్క‌రుగా బ‌య‌ట ప‌డుతున్నారు. ఏసీబీ దాడుల నేప‌థ్యంలో క‌ళ్లు చెదిరేలా ఆభ‌ర‌ణాలు, నోట్ల క‌ట్ట‌లు , అక్ర‌మ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా స‌ర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్ట‌ర్ గా ఉన్న న‌ర‌హ‌రి రావు ఆస్తులు ఏకంగా రూ. 200 కోట్లకు పైగానే ఉంటాయ‌ని అంచ‌నా వేసింది ఏసీబీ. హైదరాబాద్‌లోని షాలిబండ కెనరా బ్యాంక్‌లో ఉన్న సుంకరి నరహరి రావు లాకర్ నుండి ఏసీబీ (ACB) రూ. 1.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇంతకు ముందే రూ. 13.05 కోట్ల విలువైన (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా) ఆస్తులను గుర్తించారు.

అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ సర్వే, భూ రికార్డుల శాఖ (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును తెలంగాణ ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.24 ఎకరాల భూమి, 4 ఫ్లాట్లు, 2 భవనాలు… వీటి విలువ రూ. 13.05 కోట్లు (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *