చంద్ర‌బాబును చూసి గ‌ర్వ ప‌డుతున్నా

ప్ర‌శంస‌లు కురిపించిన అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరును చూసి తాను గ‌ర్వ ప‌డుతున్నాన‌ని అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విష‌యంలో ఆనందంంగా ఉంద‌న్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ కూట‌మి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. భూసార పరిరక్షణ, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలు గతంలో నిలిచిపోయాయని, ప్రస్తుతం వాటిని పునరుద్ధరించి రైతులకు అందిస్తున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు.

వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటోందని, శాస్త్రవేత్తల సూచనలు, ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందని రైతులకు సూచించారు మంత్రి. గ‌త ఏడాది పొగాకు, కోకో, ఉల్లి, తోతాపురి మామిడి వంటి పంటలకు మార్కెట్ ధరలు తగ్గిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు అందించి రైతులకు తోడ్పాటును అందించింద‌న్నారు అచ్చెన్నాయుడు. తోతాపురి మామిడి ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *