మీనాక్షి న‌ట‌రాజన్ కేసుపై కంభం కామెంట్స్

Spread the love

త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న

నారాయ‌ణ‌పేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కంభం శివకుమార్ రెడ్డి స్పందించారు. తనపై తప్పుడు కథనాలు ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. శ్రీలత – శివకుమార్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదంలో ఇటీవల మరోసారి కోర్టు లో పిటిషన్ వేసింది బాధితురాలు.!

అందులో శివకుమార్ రెడ్డి తదితరులతో పాటు మీనాక్షి నటరాజన్ పేరు కూడా ప్రస్తావించింది శ్రీ‌ల‌త‌. దీంతో మీనాక్షి కి నోటీస్ ఇచ్చింది కోర్టు. ఈ నోటీస్ విషయాన్ని నామినేషన్ లో మీనాక్షి పేర్కొనక పోవడం వల్ల.. ఆమె రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విష‌యం విదిత‌మే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.. పార్టీ పరంగా అంతర్గత విచారణ జరుగుతోంది.

బీజేపీ నేతలకి ఈ విషయాన్ని ఎవరో.చేరవేయడం వల్లే.. వాళ్ళు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి మీనాక్షి నామినేషన్ ఫెయిల్ అయ్యేలా చేశారని, సమాచారాన్ని చేరవేసింది ఎవరనే విషయంలో విచారణ జరుపుతున్నారని శివ‌కుమార్ రెడ్డి తెలిపారు. మీనాక్షికి అన్యాయం జరగడం వల్లే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు .

  • Related Posts

    హామీల అమ‌లుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ

    Spread the love

    Spread the loveరాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడ‌టం లేదు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు రామ‌చంద‌ర్ రావు. ఆదివారం ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు ముఖ్య‌మంత్రి ఎ.…

    కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

    Spread the love

    Spread the loveడీకేకు మ‌ద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *