శ్రీసిటీ వర్సిటీ ద్వారా 75 వేల ఉద్యోగాలు

క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన నారా లోకేష్

తిరుప‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తిరుప‌తి లోని శ్రీ సిటీ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ద్వారా 75 వేల జాబ్స్ క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. రోజు రోజుకు టెక్నాల‌జీలో కీల‌క‌మైన మార్పులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు మారాల‌ని సూచించారు. లేక‌పోతే వెనుక‌బ‌డి పోతామ‌ని పేర్కొన్నారు . ఇప్పుడు కేవలం డిగ్రీ ఉంటే సరిపోద‌న్నారు. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, టెక్నాలజీకి తగ్గట్టు మారడం, లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండేలా మన స్టూడెంట్స్ ని రెడీ చేయడం చాలా ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU) సరిగ్గా అలాంటి ఆలోచనతోనే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

.దీని ద్వారా మరో 75 వేల ఉద్యోగాలు తీసుకు రావాలన్నది నా టార్గెట్ అని ప్ర‌క‌టించారు నారా లోకేష్. 2029కల్లా దానిని సాకారం చేయాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. 31 దేశాల నుంచి 200 కంపెనీలు ఇప్పటికే ఇక్కడున్నాయని తెలిపారు. మీరిక్కడ చేస్తున్నది నిజంగా మ్యాజిక్ లాంటిది. ఇండియా ఏంటో చూపించడానికి మీరొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. గత 20 ఏళ్లుగా దీన్ని అచీవ్ చేసినందుకు శ్రీని రాజు కి, రవి సన్నా రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. దీనికి ఎంతో డెడికేషన్ కావాలి. కలలు కనడం చాలా ముఖ్యం. శ్రీని రాజు పెద్దగా కలలు కనరని నా ఫీలింగ్, ఎందుకంటే ఆయన ప్రతిరోజూ ఆ కలలోనే బతుకుతున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయన పెద్ద డ్రీమర్, దాన్ని సాధించడానికి ఆయన మా అందరినీ ఎంకరేజ్ చేస్తుంటార‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *