ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి

అమ‌రావ‌తి : ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి క‌ల్పించ‌డం ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు . కోళ్ల పెంపకం దారులకు మేలు జరిగేలా తమ సంస్థ పని చేస్తుందన్న ఏబీఐఎస్ ప్రతినిధులు. శుక్ర‌వారం ఏబీఐఎస్ నిర్వహించిన జాబ్ ఫేర్ లో ఉద్యోగాలు పొందిన పలువురికి ఆఫర్ లెటర్లు అందించారు సీఎం. కుప్పం నియోజకవర్గంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఉపాధిపై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఆధునిక టెక్నాలజీని…

newsseals-APCM

అమ‌రావ‌తి : ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి క‌ల్పించ‌డం ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు . కోళ్ల పెంపకం దారులకు మేలు జరిగేలా తమ సంస్థ పని చేస్తుందన్న ఏబీఐఎస్ ప్రతినిధులు. శుక్ర‌వారం ఏబీఐఎస్ నిర్వహించిన జాబ్ ఫేర్ లో ఉద్యోగాలు పొందిన పలువురికి ఆఫర్ లెటర్లు అందించారు సీఎం. కుప్పం నియోజకవర్గంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఉపాధిపై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఆధునిక టెక్నాలజీని వినియోగించిన‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు సీఎంకు. దేశంలో అతి పెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. స్థానిక కోళ్ల పెంపకందారులు ఈ సంస్థ ద్వారా లబ్ది పొందుతారని చెప్పారు. ఈ సంస్థ ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుంద‌న్నారు. ఏబీఐస్ పరిశ్రమ ద్వారా పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంద‌న్నారు. చాలా తక్కువ సమయంలో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి… కార్యాకలాపాలను ప్రారంభించేలా చేసినందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

వాళ జమ్మల మడుగులో స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, ఇదంతా తమ కూటమి స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు. సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటిని పెంచుతున్నాం అని వెల్ల‌డించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు.. జీవన ప్రమాణాలను పెంచేలా పరిశ్రమలు తెచ్చాం అన్నారు. వస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ కూడా సిద్దం కావాలని పిలుపునిచ్చారు సీఎం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports