Friday, 16 October 2026

విశాఖ‌లో రెండు హొట‌ల్ ప్రాజెక్టుల‌కు ఆమోదం

newsseals-APGovt

అమ‌రావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని విశాఖ న‌గ‌రంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలోని అన్నవరంలో ‘క్లబ్ మహీంద్రా’ బ్రాండ్ కింద ‘శుభ సంకల్ప్’ సంస్థ రూ. 174 కోట్ల పెట్టుబడితో ఒక త్రీ-స్టార్ హోటల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం 11.24 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించారు. దీనివల్ల సుమారు 150 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

అలాగే మధురవాడలో ‘శ్రీ దుర్గా కాన్‌దేవ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘పద్మ హాస్పిటాలిటీ’ సంస్థలు కలిసి ‘ప్రమోద్ హోటల్స్ అండ్ రిసార్ట్స్’ పేరుతో రూ. 163 కోట్ల పెట్టుబడితో ఒక ఫైవ్-స్టార్ హోటల్‌ను అభివృద్ధి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 4.39 ఎకరాల భూమిని లీజుకు కేటాయించింది, దీని ద్వారా సుమారు 150 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు మెరుగు పడతాయని, దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులు అధిక సంఖ్యలో ఆకర్షితులవుతారని, అలాగే హాస్పిటాలిటీ రంగం వృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా సృష్టించ బడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *