చారిత్రక క‌మాన్ల పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ. 11.86 కోట్లు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైదరాబాద్ పాత నగరంలోని ఎనిమిది చారిత్రక తోరణాల (కమాన్ల) పునరుద్ధరణకు శుక్ర‌వారం రూ. 11.86 కోట్లు మంజూరు చేసింది. ఈ పునరుద్ధరణ పనులను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) చేపడుతుంది . దీనికి అయ్యే ఖర్చును HMDA నిధుల నుండి భరిస్తారు. పాత నగరంలోని ఈ కమాన్లు బాగా శిథిలమై భద్రతాపరమైన ముప్పును కలిగి ఉన్నాయని గుర్తించారు అధికారులు. ఈ మేర‌కు రాష్ట్ర…

newsseals-TelanganaGovt

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైదరాబాద్ పాత నగరంలోని ఎనిమిది చారిత్రక తోరణాల (కమాన్ల) పునరుద్ధరణకు శుక్ర‌వారం రూ. 11.86 కోట్లు మంజూరు చేసింది. ఈ పునరుద్ధరణ పనులను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) చేపడుతుంది . దీనికి అయ్యే ఖర్చును HMDA నిధుల నుండి భరిస్తారు. పాత నగరంలోని ఈ కమాన్లు బాగా శిథిలమై భద్రతాపరమైన ముప్పును కలిగి ఉన్నాయని గుర్తించారు అధికారులు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి నిధులు మంజూరు కోసం విన్న‌వించారు. ఇదిలా ఉండ‌గా కేవలం చిన్నపాటి మరమ్మతుల ప్రతిపాదనను పక్కనపెట్టి, సమగ్ర పునరుద్ధరణ కోసం ఈ నిధులను మంజూరు చేశారు.

వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (DPRs) రూపొందించడానికి కన్సల్టెంట్లను నియమించు కోవడానికి ,ప్రతి పునరుద్ధరణ పనికి ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించడానికి కూడా ప్రభుత్వం QQSUDAకు అనుమతినిచ్చింది. ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పరిధిలోకి రాణిగంజ్ కమాన్ (₹0.63 కోట్లు), షేక్ ఫైజ్ కమాన్ (₹0.82 కోట్లు), ఛట్టా బజార్ కమాన్ (₹1.40 కోట్లు), దివాన్ డియోడి కమాన్-I (₹2 కోట్లు), దబీర్‌పుర కమాన్ (₹1.14 కోట్లు), హుస్సేనీ ఆలం కమాన్ (₹0.55 కోట్లు), దివాన్ డియోడి కమాన్-II (₹2.38 కోట్లు) , హష్మత్‌గంజ్ కమాన్ (₹2.94 కోట్లు) వస్తాయి. 2023లో ఆరు చారిత్రక తోరణాలకు చిన్నపాటి మరమ్మతుల కోసం మంజూరు చేసిన ₹2 కోట్లు సరిపోవని ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే ఆ ప్రతిపాదిత పనులు నిర్మాణం యొక్క దృఢత్వాన్ని , భద్రతను పునరుద్ధరించలేవని తేలింది. తత్ఫలితంగా, పాత మంజూరును రద్దు చేసి, ప్రభుత్వం ఈ కొత్త ఉత్తర్వును జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports