చంద్ర‌బాబు నాయుడుపై భ‌గ్గుమ‌న్న పాశం యాద‌గిరి

హైద‌రాబాద్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌ని అన్నారు. ఇక్క‌డ పోలీసు శాఖ అనేది ఒక‌టి ఉందా అని ప్ర‌శ్నించారు. ఏపీకి చెందిన పోలీసులు తెలంగాణ‌కు చెందిన జ‌ర్న‌లిస్టుల‌ను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకు పోతుంటే డీజీపీ, సీపీ ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ‌క్తు తెలంగాణ వ్య‌తిరేకిగా మారాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా కొల్లాపూర్ కు చెందిన కె. వెంక‌ట్రామి రెడ్డి ని అక్ర‌మంగా, దౌర్జ‌న్యంగా అంద‌రు చూస్తూ ఉండ‌గానే ఈడ్చుకు వెళ్లార‌ని ఆరోపించారు. రాష్రంలో ప్ర‌జా పాల‌న సాగ‌డం లేద‌ని ప్ర‌జా కంఠ‌క‌, నియంత పాల‌న కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు.

ఇప్ప‌టికే తెలంగాణ‌ను ఆంధ్ర నాయ‌కులు చెర బ‌ట్టార‌ని, మ‌రోసారి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పాశం యాద‌గిరి. ప్ర‌జ‌లంతా మూకుమ్మ‌డిగా తిర‌గ‌బడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పిల‌లుపునిచ్చారు. ఇప్ప‌టికే నీళ్లల‌ను, విలువైన భూముల‌ను కొల్ల‌గొట్టార‌ని, మ‌రోసారి తెలంగాణను నిలువునా దోపిడీ చేసేందుకు కుట్ర‌ల‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి. ఓ వైపు ఆంధ్రా పోలీసుల‌కు ఎలా ప‌ర్మిష‌న్ , ఎవరు పంపిస్తే వ‌చ్చారో చెప్పాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై ఉంద‌న్నారు. ఏ మాత్రం కేవీఆర్ కు ప్రాణ హాని త‌ల‌పెట్టినా తాము చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు. తెలంగాణ భ‌గ్గుమంట‌ద‌ని పేర్కొన్నారు .ఇంకోసారి తెలంగాణ ప్రాంతాన్ని, అస్తిత్వాన్ని, యాస‌ను, భాష‌ను కించ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తే ఉరికించి దాడి చేయాల్సి వ‌స్తుంద‌న్నారు.

  • Related Posts

    నాణ్య‌మైన యూనిఫాంల‌ను అందించ‌క పోతే ఎలా..?

    హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్య‌వ‌స్థ దారుణంగా దిగ‌జారి పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.…

    తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్

    హైద‌రాబాద్ : తెలంగాణ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఒకటి లేదా రెండు సార్లు మోస్తరు వర్షం కురిసే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *