రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 19వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

newsseals-APSIPB

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 19వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

  1. డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ నెల్లూరు జిల్లాలో 4 స్టార్ హోటల్ – రూ.139.92 కోట్ల పెట్టుబడి, 180 మందికి ఉపాధి.
  2. మాధవి లీజర్ అండ్ స్టేస్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్సార్ కడప జిల్లాలో 3 స్టార్ హోటల్ – రూ.52.10 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉపాధి.
  3. శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్సార్ కడప జిల్లాలో సమగ్ర అమ్యూజ్‌మెంట్ పార్క్ – రూ.68.69 కోట్ల పెట్టుబడి, 690 మందికి ఉపాధి.
  4. వజ్ర హాస్పిటాలిటీ ఎల్ఎల్‌పీ విజయవాడలో హోటల్, బ్యాంక్వెట్, ఎగ్జిబిషన్ సెంటర్ – రూ.62.40 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉపాధి.
  5. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ (NILP) తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఎట్టిపాకంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ – రూ.255 కోట్ల పెట్టుబడి, 400 మందికి పైగా ఉపాధి.
  6. అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా పరవాడలో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్ – రూ.1,600 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉపాధి.
  7. బెర్రీ అలాయ్స్ లిమిటెడ్ బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సిన్టర్, డీఆర్ఐ, కార్బన్ పేస్ట్ ప్లాంట్ – రూ.1,200 కోట్ల పెట్టుబడి, 831 మందికి ఉపాధి.
  8. జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ – రూ.689 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉపాధి.
  9. ఈకో బాక్స్ ఇండస్ట్రియల్స్ అసెట్ IV ప్రైవేట్ లిమిటెడ్ (గూగుల్ వేర్ హౌస్ పార్టనర్స్) విశాఖపట్నంలో లాజిస్టిక్స్, లైట్ ఇండస్ట్రియల్ పార్క్ – రూ.1,008 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి.
  10. అదానీ ఫౌండేషన్ విశాఖపట్నం జిల్లా కపులుప్పాడలో ప్రాజెక్టు – రూ.2,200 కోట్ల పెట్టుబడి.
  11. మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ – రూ.1,801 కోట్ల పెట్టుబడి, 80 మందికి ఉపాధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports