సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డి పై భగ్గుమన్నారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కుటుంబంపై. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజలు నేలకేసి కొట్టారని, కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని, తనను తట్టుకోవడం కష్టం అన్నారు. తనతో పెట్టుకుంటే పాతాళానికి తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. మరో వైపు అనుచిత వ్యాఖ్యలు మరోసారి చేయడం పట్ల సీఎంపై సీరియస్ అయ్యారు కేటీఆర్. ఇవాళ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ప్రజల మీదికి తుపాకీ తీసుకపోయిన నీకే ఇంత ఉంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలి.? అంటూ నిలదీశారు కేటీఆర్. మా పార్టీని మొలకెత్తనియ్య అంటుండు కదా.. ఎలక్షన్లు పెట్టుమను రాష్ట్రంలో, ఉపఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా.. రమ్మను చూస్తా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సర్వేలోనే 78 సీట్లతో BRS అధికారంలోకి రాబోతుందని వచ్చిందన్నారు. నేను చెప్పేది అబద్ధమైతే ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడో చెప్పాలన్నారు.