సీఎంకు ద‌మ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేయాలి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డి పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖ‌మ్మంలో జ‌రిగిన రైతు ఆశీర్వాద స‌భ‌లో ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్ కుటుంబంపై. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, ప్ర‌జ‌లు నేల‌కేసి కొట్టార‌ని, కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యాడ‌ని, త‌న‌ను త‌ట్టుకోవ‌డం కష్టం అన్నారు. త‌న‌తో పెట్టుకుంటే పాతాళానికి తొక్కేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పారు. మ‌రో వైపు అనుచిత వ్యాఖ్య‌లు మ‌రోసారి చేయ‌డం ప‌ట్ల సీఎంపై సీరియ‌స్ అయ్యారు కేటీఆర్. ఇవాళ తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ ప్రజల మీదికి తుపాకీ తీసుకపోయిన నీకే ఇంత ఉంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలి.? అంటూ నిల‌దీశారు కేటీఆర్. మా పార్టీని మొలకెత్తనియ్య అంటుండు కదా.. ఎలక్షన్లు పెట్టుమను రాష్ట్రంలో, ఉపఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా.. రమ్మను చూస్తా అని స‌వాల్ విసిరారు. రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సర్వేలోనే 78 సీట్లతో BRS అధికారంలోకి రాబోతుందని వచ్చిందన్నారు. నేను చెప్పేది అబద్ధమైతే ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడో చెప్పాల‌న్నారు.

  • Related Posts

    స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు

    అమ‌రావ‌తి : సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై ఇంకా వర్క్‌వుట్ చేస్తున్నామని వివరించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహిళలను…

    బాధిత కుటుంబాల‌కు సీఎం విజ‌య్ భ‌రోసా

    చెన్నై : క‌రూర్ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *