వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేన‌త శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసంద‌ర్బంగా వియ‌త్నాంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. త‌ను క‌డ‌ప జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉన్నారు. ఇందులో భాగంగా వియత్నాం సందర్శనకు వెళ్లిన కడప వాసి, ఆ దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో ముడియం శ్రీధర్ సహా 15 మంది మృత్యువాత పడడం బాధాకరమన్నారు.

సంతోషంగా ముగియాల్సిన విదేశీ టూర్ విషాదంగా ముగియడంపై ఎస్.స‌విత‌ ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి వ్యక్తం చేశారు. శ్రీధర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే విదేశాంగ అధికారులతో, ఢిల్లీ భవన్ అధికారులతో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారని తెలిపారు. ఏపీకి చెందిన టూరిస్ట్ లతో పాటు శ్రీధర్ మృతదేహాన్ని కూడా స్వస్థలానికి రప్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు వియత్నాం, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. బాధిత కుటుంబానికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

  • Related Posts

    97 రద్దు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

    హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ ప‌నితీరుపై. రేవంత్ రెడ్డి కి ఓటు వేసిన కర్మకు ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎవరిని…

    ఏపీ గ్రీన్ కార్య నిర్వాహ‌క క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌బాబు

    అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , శాస‌న మండ‌లి స‌భ్యుడు , ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కొణిద‌ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్టబెట్టింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హ‌రితంగా మార్చ‌చేందుకు స‌ర్కార్ కంక‌ణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *