వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
చెన్నై : భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపీఎల్ టైటిళ్లను స్వంతం చేసుకుంది. పలువురిని మార్చింది సీఎస్కే యాజమాన్యం. కానీ వర్కవుట్ కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ ను ప్రస్తుతానికి కెప్టెన్ గా కొనసాగిస్తున్నా భారీ ధరకు కొనుగోలు చేసిన సంజు శాంసన్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం ధోనీ లాగానే తను కూడా వికెట్ కీపర్, కెప్టెన్ . అంతే కాకుండా మిస్టర్ కూల్ గా పేరు పొందాడు శాంసన్. దీంతో ఎంఎస్ కూడా తన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు.
తాజాగా వచ్చే 2027లో జరిగే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడక పోవచ్చని క్రికెట్ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. తన భవిష్యత్తు గురించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం MS ధోనీతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఈ దిగ్గజ కెప్టెన్ మరో సీజన్ ఆడాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే IPL 2027లో ధోనీ ఆటగాడిగా తిరిగి రావడం అసంభవంగా కనిపిస్తోంది. అయితే, ధోనీ వేరే ఏదైనా పాత్రలో జట్టుతో కొనసాగుతారని ఆశిస్తూనే, ఒక కొత్త శకంలోకి అడుగు పెట్టేందుకు CSK సన్నద్ధమవుతోంది.