కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
న్యూఢిల్లీ : సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించారు. పాల్గొన్న సభ్యులు కీలక ప్రశ్నలు సంధించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మోదీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకించి సర్ పేరుతో ఓటర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చాలా రాష్ట్రాలలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే పవర్ లో ఉంది. ఒకటి తెలంగాణ రెండు హిమాచల్ ప్రదేశ్ మూడు కర్ణాటక. ఇక తమిళనాడుతో పాటు కేరళలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై తీవ్రంగా చర్చించారు. కింది స్తాయి నుంచి పై స్తాయి వరకు ఎలా అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కోవాలనే దానిపై కూడా ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం.