newsseals.com

లీడర్‌షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది

July 17, 2026 · VijayaBhaskar

చెన్నై : దేశ రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అవినీతి ర‌హిత పాల‌నే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. త‌ను సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి నేటి వ‌ర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ప్ర‌ధానంగా రాష్ట్రాన్ని జ‌ల‌గ‌ల్లా ప‌ట్టి పీడిస్తున్న విద్యా రంగాన్ని ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించాడు. దీంతో ఒక్క‌సారిగా కార్పొరేట్ విద్యా సంస్థ‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఆపై ప్ర‌భుత్వం నిర్దేశించిన ఫీజుల‌ను మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని ఆదేశించాడు. లేక పోతే , అమ‌లు చేయ‌క పోతే మూసి వేయాల‌ని ఆదేశించాడు. దెబ్బ‌కు ఆయా కార్పొరేట్ సంస్థ‌లు దిగి వ‌చ్చాయి. జీ హుజూర్ అంటున్నాయి. ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమ ఉంటే, సేవ చేయాల‌న్న త‌లంపు ఉంటే ఏదైనా సాధ్యం అని నిరూపించాడు చేత‌ల్లో సీఎం జోసెఫ్ విజ‌య్.

తాజాగా ఆయ‌న మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రైనా పేద కుటుంబానికి చెందిన వారు కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చ‌ని పోతే అందుకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ప్రైవేట్ ఆస్ప‌త్రుల నిలువు దోపిడీకి చెక్ పెట్టాడు విజ‌య్. ఇక ఎవ‌రైనా లంచం అడిగితే నేరుగా త‌న‌కు స‌మాచారం ఇవ్వాల‌ని వెల్ల‌డించాడు. తాజాగా మ‌రో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. మన దగ్గర కొందరు ఎమ్మెల్యేలు లేదా మంత్రులు విజిట్‌కు వెళ్తే, ముందు HODని సీట్లోంచి లేపించి ఆ పెద్ద కుర్చీలో కూర్చొని “నేనే బాస్” అనే బిల్డప్ ఇచ్చే సందర్భాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూస్తే త‌మిళ‌నాడు సీఎం విజయ్ మాత్రం డాక్టర్ గౌరవాన్ని కాపాడుతూ HOD సీటులో కాకుండా ఎదురుగా ఉన్న విజిటర్ కుర్చీలో కూర్చున్నారు. నాయకత్వం అంటే పదవి లేదా కుర్చీ కాదు ఎదుటి వారికి ఇచ్చే గౌరవం, చూపించే వినయం. నిజమైన లీడర్‌షిప్ కుర్చీలో కాదు..అది ప్రవర్తనలో ఉంటుంది. హ్యాట్సాఫ్ బాస్ అంటున్నారు తమిళ‌తంబిలు.

Related News