హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ నోలన్ ముఖ్య పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ప్రముఖ పేరు పొందిన కావ్యం ది ఒడిస్సీ మూవీ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోట్లు కురిపిస్తోంది. బాక్సులు నిండి పోతున్నాయి కాసులతో. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 20.76 కోట్లతో ప్రారంభమై, మరుసటి రోజు రూ. 26 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండవ రోజున దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 47.03 కోట్లు వసూలు చేసింది. ఒడిస్సియస్‌గా మాట్ డామన్, టెలిమాకస్‌గా టామ్ హాలండ్, ఏథెనాగా జెండయా, ఆంటినస్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్, హెలెన్ ఆఫ్ ట్రాయ్ , క్లైటెమ్నెస్ట్రాగా లుపిటా న్యోంగో, పెనెలోప్‌గా యాన్ హాత్వే , కాలిప్సోగా చార్లీజ్ థెరాన్ తదితరులు నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
ఇక ది ఒడిస్సీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొత్తం వసూళ్లు 200 మిలియన్ డాలర్లను దాటాయి. “ది ఒడిస్సీ” చిత్రం ట్రోజన్ యుద్ధం తర్వాత గ్రీకు రాజు ఒడిస్సియస్ (డేమన్ పోషించిన పాత్ర) తన ఇంటికి తిరిగి రావడానికి చేసే 10 సంవత్సరాల ప్రమాదకరమైన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే దేవతలు, సముద్ర రాక్షసులు , మంత్రగత్తెలచే చుట్టుముట్టబడిన అతను, తన భార్య పెనెలోప్ (హాత్వే) , కుమారుడు టెలిమాకస్ (హాలండ్)తో తిరిగి కలవడానికి పోరాడతాడు. ప్రస్తుతం సినీ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. కొన్ని టాకీసులలో టికెట్లు దొరకక ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





