మోదీ భోగాపురం ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు : అనిత

అమ‌రావ‌తి : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 1న శ‌నివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో అత్యాధునిక వ‌స‌తుల‌తో నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు దాదాపు రూ. 17 వేల కోట్ల‌కు పైగా విలువ చేసే ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఏపీ కూట‌మి స‌ర్కార్. పెద్ద ఎత్తున సెక్యూరిటీని క‌ల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదికి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు.

అంతే కాకుండా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ‘ధింసా’ నృత్య ప్రదర్శన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి గమ్మడి సంధ్యారాణితో కలిసి సమీక్షించారు వంగ‌ల‌పూడి అనిత‌. ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమంలో, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా 13,000 మంది గిరిజన బాలికలతో నృత్య ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, గొట్టిపాటి ర‌వికుమార్, కింజార‌పు అచ్చెన్నాయుడు, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, కొలుసు పార్థ‌సార‌థి, భ‌ర‌త్ తో పాటు ఎంపీలు హాజ‌రు కానున్నారు.

  • Related Posts

    ఆవిష్క‌ర‌ణ‌ల కోసం ప‌రిశోధ‌న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

    హైద‌రాబాద్ : YISUలో ఆవిష్కరణల కోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’…

    స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ కు మ‌ర్రి చెన్నారెడ్డి పేరు

    హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌న‌త్ న‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన టిమ్స్ కు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త మ‌ర్రి చెన్నారెడ్డి పేరుగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *