గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా

హైద‌రాబాద్ : గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ఇండియన్ బ్యాంక్ ఇండీ-గిగ్ చాంపియన్ పొదుపు ఖాతాను గురువారం ప్రారంభించింది. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు )తో పైలట్ కార్యక్రమం కింద దీనిని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా యాప్ ఆధారిత ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ కార్మికులు, ఫ్రీలాన్సర్లు , ఇతర డిజిటల్ వర్క్‌ఫోర్స్ భాగస్వాములతో సహా గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “ఇండీ-గిగ్ చాంపియన్” అనే ప్రత్యేక బ్యాంకింగ్ ఉత్పత్తిని ఇండియన్ బ్యాంక్ ప్రవేశపెట్టింది.

గిగ్ కార్మికుల ఆర్థిక చేరికకు మద్దతుగా ఎఫ్జీఎం రామచంద్ర బాబు, హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్, ఆర్ అండ్ జీఆర్ హెడ్ కె. శేఖర్ బాబు , తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మార్గదర్శకత్వంలో ఇండియన్ బ్యాంక్ ఒక పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఉన్న టీజీపీడబ్ల్యూయూ కార్యాలయంలో ఈరోజు మొదటి 100 పొదుపు ఖాతాలు తెరిచారు. మరిన్ని వేల మంది కార్మికులకు ఈ ప్రయోజనాలను విస్తరించడానికి త్వరలో ఒక పెద్ద ఎత్తున ఖాతా తెరిచే శిబిరం నిర్వహించనున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు షేక్ స‌లావుద్దీన్.

ఈ పొదుపు ఖాతా వ‌ల్ల గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల‌కు ఎంతో మేలు చేకూర‌నుంది. ఈ ఇండీ-గిగ్ ఛాంపియన్ పొదుపు ఖాతా ద్వారా ఉచిత జీరో-బ్యాలెన్స్ తో పాటు అర్హులైన గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులకు రూ. 5,00,000 వరకు ఉచిత గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ,పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు స‌లావుద్దీన్. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల జీవనోపాధికి మద్దతునిచ్చే, అందుబాటులో ఉండే, సురక్షితమైన , సమ్మిళిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా వారి ఎదుగుదలలో ఆర్థిక భాగస్వామిగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు.

గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల ఆర్థిక భద్రత దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు షేక్ స‌లావుద్దీన్. ఉచిత జీరో-బ్యాలెన్స్ పొదుపు ఖాతాతో పాటు 5 లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఎంతో అవసరమైన రక్షణను అందించి, మరింత ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గిగ్ కార్మికుల అవసరాలను గుర్తించి, ఈ ముఖ్యమైన చొరవలో టిజిపిడబ్ల్యూ యు తో భాగస్వామ్యం అయినందుకు ఇండియన్ బ్యాంక్‌కు తాము ద‌న్య‌వాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Related Posts

    మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్ట్

    పాకిస్తాన్ : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయ‌న‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ పీటీఐ పార్టీ సెప్టెంబ‌ర్ 27న దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇమ్రాన్…

    కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోసం ..? : ఎంకే స్టాలిన్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ ప్ర‌తిపాదించిన కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోస‌మ‌ని ప్ర‌శ్నించారు. బీచ్ సమీపంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *