స‌ర్ ప్ర‌క్రియ‌పై బీఎల్ఏలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

హైద‌రాబాద్ : ఎస్.ఐ.ఆర్‌ మొదటి దశ ప్రక్రియ కంటే రెండో దశలో బీఎల్‌ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్‌ల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు . స‌ర్ పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శించే వారిని ఉపేక్షించ వ‌ద్ద‌ని పేర్కొన్నారు. త‌క్ష‌ణ‌మే వారిని తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేశారు మ‌హేష్ కుమార్ గౌడ్. స‌ర్ ప్ర‌క్రియ పురోగ‌తిపై టీపీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు.

ఈ రోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్‌ల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, ఎస్.ఐ.ఆర్. ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. మొదటి దశ ఈ రోజుతో పూర్తయిందని, రేపటి నుంచి ఎస్.ఐ.ఆర్‌ రెండో దశ ప్రారంభం అవుతుందని అన్నారు . ఈ దశలో చాలా అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

ఇప్పటి వరకు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ పూర్తయిందని, ఇక నుంచి అనామలీస్ లిస్ట్‌లను జాగ్రత్తగా గమనించాలని అన్నారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వర్గాల ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా తీసుకుని గట్టిగా పనిచేయాలని అన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలని సూచించారు.

బీఎల్‌ఏలు చాలా క్రియాశీలకంగా పనిచేయాలని, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని, సక్రమంగా పనిచేయని వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించారు.

  • Related Posts

    పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాల‌ని సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీల‌క మీటింగ్ లో 334 రహదారి మౌలిక…

    పోస్ట‌ల్ ఇన్‌స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్

    న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్ట‌ల్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు సర్కిల్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన ప‌నికి ఇవాళ దేశంలోని కోట్లాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *