హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ, అనుముల కొండల్ రెడ్డి, అనుముల నయన్ రెడ్డిలను ప్రతిపాదులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన ‘టెస్సెరాక్ట్’ (Tesseract) భూ కుంభకోణంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల దుర్వినియోగం, బినామీ లావాదేవీలు, బంధుప్రీతి , అధికార దుర్వినియోగం వంటి అంశాలపై BRS నాయకులు 13 కీలక ఆధారాలతో కూడిన సమగ్ర ఫిర్యాదును దాఖలు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో సుమారు 5 ఎకరాల అత్యంత విలువైన (మార్కెట్ విలువ రూ. 135 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ‘మెస్సర్స్ టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి కేటాయించడంపై BRS ప్రజాప్రతినిధుల బృందం తెలంగాణ లోకాయుక్తకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. MLCలు శ్రవణ్ దాసోజు, మానకెన్ కోటిరెడ్డి; MLAలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్; BRS నాయకులు క్రిషాంక్ సమర్పించిన వారిలో ఉన్నారు.





