ఓటు తొల‌గింపుపై నిప్పులు చెరిగిన ప్ర‌కాశ్ రాజ్

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై భ‌గ్గుమ‌న్నారు. తాజాగా త‌న ఓటు హ‌క్కుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త కొంత కాలంగా ప్ర‌కాష్ రాజ్ త‌న వాయిస్ ను పెంచారు. కేంద్రం ఆధ్వ‌ర్యంలో తీసుకు వ‌చ్చిన ప‌లు నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. ఆపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. ఇదే క్ర‌మంలో దేశంలో ప్ర‌జాస్వామ్యం రోజు రోజుకు క్షీణిస్తోంద‌ని ఆవేద‌న చెందారు.

ఇదే క్ర‌మంలో దేశంలో మ‌తం పేరుతో, కులం పేరుతో విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ మ‌నుషుల‌ను విడ‌దీస్తున్న బీజేపీ, దాని హిందూత్వ సంస్థ‌ల‌ను ఏకి పారేశారు. ఇదే క్ర‌మంలో స‌ర్ పేరుతో కీల‌క‌మైన ఓ వ‌ర్గానికి చెందిన వారి ఓట్ల‌ను లేకుండా చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపారు. ఇదే క్ర‌మంలో క‌ర్ణాట‌క రాష్ట్రంలో త‌న‌కు ఓటు హ‌క్కు అనేది లేక పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. తన‌కు రెండు చోట్ల ఓటు ఉంద‌నే కార‌ణంగా ఎలా తొలగిస్తారంటూ ప్ర‌శ్నించారు ప్ర‌కాష్ రాజ్. ఈ సంద‌ర్భంగా కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. మీరు త‌న ఓటును తొల‌గించ‌రేమో కానీ తాను అంత‌కంటే ఎక్కువ‌గా ఓట‌ర్ల‌ను ప్రభావితం చేయ‌గ‌ల‌న‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    ఎన్నిక‌ల సంఘం తీరుపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్

    హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క అని, గ‌త కొన్నేళ్లుగా ఓటు వేస్తూ వ‌చ్చాన‌ని, తాను అక్క‌డే చ‌దువుకున్న విష‌యాన్ని తెలియ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *