2047 నాటికి దేశంలోనే ఏపీని నెంబ‌ర్ వ‌న్ చేయాలి

అమ‌రావ‌తి : 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పని చేద్దామ‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న 80వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ దేశం మనకు హక్కుల్ని ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలని అన్నారు సీఎం. నా దేశం-నా బాధ్యత అని ముందుకు సాగాలన్నారు. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్లు అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ దేశానికి మనం ఏం ఇవ్వగలం అని ఆలోచించడమే ‘అనే నేను…’ సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, సమాజ హితం కోసం పనిచేయాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకితభావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమేన‌ని చెప్పారు సీఎం. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిస్తే అది దేశ సంకల్పం అవుతుందని అన్నారు. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అదే వికసిత్ భారత్ 2047…స్వర్ణాంధ్ర 2047 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని గెలుద్దాం అని పిలుపునిచ్చారు.

  • Related Posts

    సీఎం త‌మ్ముడి కంపెనీపై లోకాయుక్త‌లో ఫిర్యాదు

    హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి త‌మ్ముడు కొండ‌ల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత‌లు లోకాయుక్త‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, టీజీఐఐసీ, అనుముల కొండ‌ల్ రెడ్డి, అనుముల న‌య‌న్ రెడ్డిల‌ను ప్ర‌తిపాదులుగా…

    రాచ‌రిక పాల‌న సాగిస్తున్న రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలు ప‌నుల‌న్నీ చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇవాళ ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *