సీబీఎన్ స్పీడ్ అందుకోలేం : నారా లోకేష్

విజ‌య‌వాడ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పీడ్ ను ఇప్ప‌ట్లో అందుకోవ‌డం చాలా కష్ట‌మ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత నాకు ఇస్తే.. దేశ తలరాతను మారుస్తానని స్వామి వివేకానంద అన్నారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నా. నాలుగేళ్లు ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం రాదు. నాలుగు నెలలు అమీర్ పేటలో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది. అదే స్కిల్ గ్యాప్. అందుకే నేను పరిశ్రమలు-కాలేజీలను అనుసంధానిస్తున్నాం. పరిశ్రమలు మన ఐటీఐలను అడాప్ట్ చేసుకుని వాళ్లకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తారు. ఉద్యోగాలు వెంటనే వస్తాయి. అలానే ఉన్నత విద్యను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. కరిక్యులమ్ మార్చాం. ఇన్నేళ్లుగా లేని ఫ్రొఫెసర్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాని నరేంద్ర మోదీ మనం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇక మనం అడ్రస్ లేనివాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి. ప్రజారాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చారు. పోలవరం పూర్తిచేయడానికి నిధులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేశారు.

స్వాతంత్ర దినోత్సవం రోజు మన రాష్ట్ర చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. 1953కి ముందు మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అప్పుడు మన రాజధాని చెన్నై. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత అక్టోబర్ 1, 1953న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అప్పుడు మన రాజధాని కర్నూలు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు మన రాజధాని హైదరాబాద్. 2014లో అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కనీసం కుర్చీ లేదు. రాజధాని లేదు. జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ఆ రోజు మనకున్న ధైర్యం ఒక్కటే.. మన బ్రాండ్ సీబీఎన్. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని ఇచ్చాం. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి సంస్థలను ఏపీకి తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో మీరంతా చూశారు

2024లో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అప్పటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల కుర్రాళ్లు, ఏడాది వయసున్న బాబు ఉన్నారని నేను సరదాగా అంటాను. ఆయన స్పీడ్ అందుకోవడం ఎవరివల్లా కాదు. కేబినెట్ లో చాలా మంది యువకులు ఉన్నారు కానీ సీబీఎన్ బుల్లెట్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టం. నేను గూగుల్ తీసుకొచ్చాను అనే ఆనందంతో ఆయన దగ్గరికి వెళ్లాను. ఈ రోజు మనకి ఫుల్ మార్క్స్ అనే ఫీలింగ్ లో వెళ్లాను. ఆయన వెరీగుడ్.. బాగా చేశారు అని నెక్స్ట్ మినిట్టే నెక్స్ట్ ఏంటి అన్నారు.

  • Related Posts

    స్త్రీ శ‌క్తి ప‌థ‌కం మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

    అమ‌రావతి : స్త్రీ శ‌క్తి ప‌థ‌కం మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింద‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి మహిళలతో సహా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు తేనేటీ విందు…

    నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి

    హైద‌రాబాద్ : నిరుద్యోగుల దెబ్బ‌కు దిగి వ‌చ్చారు శాసన మండ‌లి స‌భ్యులు కోదండ‌రాం రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *