Friday, 16 October 2026

గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి : అనిత

newsseals-AnithaVangalapuudi

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత స‌ముద్ర తీరంలో చేప‌ల వేట‌కు వెళ్లిన మ‌త్స్య‌కారుడు అప్ప‌న్న త‌ప్పి పోవ‌డంపై ఆరా తీశారు . ఈ సంద‌ర్బంగా ఆమె జిల్లా ఎస్పీ, క‌లెక్ట‌ర్ తో మాట్లాడారు. ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు. అప్ప‌న్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని హోం శాఖ మంత్రి ఆదేశించారు. మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు. సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ నెల 16న వేటకు 8 మంది మత్స్యకారులు వెళ్లారు. వీరిలో అప్ప‌న్న అనే ఫిష‌ర్ మెన్ ఒకరు గల్లంతు అయ్యారు. మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైనా అధికారులతో మంత్రి వాక‌బు చేశారు. గల్లంతైన అప్పన్నను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని జిల్లా క‌లెక్ట‌ర్ , ఎస్పీల‌ను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు వంగ‌ల‌పూడి అనిత‌. బాధిత మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం అని చెప్పారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *