newsseals.com

సెప్టెంబ‌ర్ 6న హిందీ బిగ్ బాస్ 20 షురూ

August 22, 2026 · VijayaBhaskar

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌యోక్త‌గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ 20 సీజ‌న్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొదలైంది. షో ప్రారంభానికి ముందు ప్రోమో షూట్‌లు కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ హిందీ సీజన్ 20 అధికారికంగా సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న షోలలో ఒకటిగా నిలిచిన బిగ్ బాస్ 20 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. హౌస్‌లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారో తెలుసు కోవడానికి అభిమానులు తాజా సమాచారంపై ఆసక్తిగా దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, బిగ్ బాస్ 20 కోసం ఎంపికైన పోటీదారులు శ‌నివారం ప్రోమో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

మరోవైపు ఆగస్టు 29న మీడియా సమావేశం లేదా సందర్శన కార్యక్రమం ఉండవచ్చని సమాచారం. ఇందులో షో హోస్ట్ సల్మాన్ ఖాన్ పాత్రికేయులతో ముచ్చటించనున్నారు. అదే రోజున వీక్షకులకు ‘హౌస్ టూర్’ (ఇంటిని చూపించే కార్యక్రమం) కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే, ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు మాత్రమేనని, ఇంకా అధికారికంగా ధృవీకరించ బడలేదని గమనించాలి. సెప్టెంబ‌ర్ లో ప్రారంభ‌మ‌య్యే ఈ షోకు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనుండగా, ఈ షో ‘కలర్స్ టీవీ’ (Colors TV)లో రాత్రి 10:30 గంటలకు ప్రసారం కానుంది.

Related News