సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ విలువైన భూములు కోల్పోతామంటూ రైతులు, ప్ర‌జ‌లు గ‌త కొన్నేళ్లుగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. కానీ డీఎంకే , అన్నాడీఎంకే ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. దీనిపై ప‌రంధూర్ విమానాశ్ర‌య వ్య‌తిరేక పోరాట క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. చివ‌ర‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం టీవీకే స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎం స్పందించారు. ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఇబ్బంది క‌లిగించే ఏ ప్రాజెక్టును చేప‌ట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

బాధితులు, ప్ర‌జ‌లు, రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. పరంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఏ ఒక్క‌రి భూమిని తాము తీసుకోవ‌డం లేద‌ని తెలిపారు సీఎం. దీంతో పరంధూర్, ఏచంకరణై వంటి గ్రామాల స్థానిక ప్రజలలో ఎంతో ఆనందాన్ని నింపింది. మంగ‌ళ‌వ‌వారం ‘పరంధూర్ విమానాశ్రయ వ్యతిరేక పోరాట కమిటీ’ సభ్యులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నాయకుడు ‘తమిళ ఎజుచ్చి తమిళన్’ (తమిళ చైతన్య ప్రదాత) ఎంపీ తోల్ తిరుమావళవన్‌తో కలిసి పోరాటంలో పాల్గొనడాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ముందు వరుసలో నిలవడం ప‌ట్ల కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా తెలిపారు.…

    ఇందిర‌మ్మ కుట్టు మిష‌న్ స్కీం ప్రారంభం

    హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీలలో భాగంగా మ‌హిళ‌ల సాధికార‌త కోసం ఉద్దేశించిన కొత్త ప‌థ‌కం ఇందిరమ్మ కుట్టు మిష‌న్ ప‌థ‌కాన్ని ఇవాల్టి నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *