Friday, 16 October 2026

జాతీయ స్థాయిలో వ‌రంగ‌ల్ హైవేకు అవార్డు

newsseals-NHAI

న్యూఢిల్లీ : జాతీయ ర‌హ‌దారుల నిర్మాణ సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది దేశంలోని ఆయా ర‌హ‌దారుల ప‌క్క‌న‌, మ‌ధ్య‌న మొక్క‌ల పెంపకాన్ని చేప‌ట్టినందుకు పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ హై వేకు, అమ‌రావ‌తి రహ‌దారి ప‌క్క‌న మొక్క‌లు పెంచినందుకు ఎంపిక చేసింది. రోడ్డు మధ్యలో మొక్కల పెంపకానికి వరంగల్‌కు, రహదారి పక్కన మొక్కల పెంపకానికి అమరావతికి ప్రథమ బహుమతి ల‌భించింది. నాగ్‌పూర్ PIU భూభాగాల్లో (land parcels) మొక్కల పెంపకానికి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించిన ఈ అవార్డులల, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం (RO) పరిధిలోని వరంగల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (PIU) రోడ్డు మధ్యలో (median) మొక్కలు నాటి పెంచినందుకు ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

అలాగే, విజయవాడ RO పరిధిలోని అమరావతి PIU రహదారి పక్కన (avenue) మొక్కలు నాటి పెంచిన విభాగంలో ప్రథమ బహుమతిని సాధించింది. NHAI గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లను స్వీకరించారు. విజేతలను ఎంపిక చేయడానికి NHAI షార్ట్‌లిస్ట్ చేసిన నామినేషన్లను పరిశీలించి మూల్యాంకనం చేసింది. మొక్కల మనుగడ రేటు, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు, నాటిన మొక్కల నాణ్యత, రక్షణ చర్యలు మరియు మొక్కల జాతుల వైవిధ్యం వంటి అంశాలతో కూడిన 100 మార్కుల ప్రమాణాల ఆధారంగా ఈ మూల్యాంకనం జరిగింది. భూభాగాల్లో (land parcels) మొక్కల పెంపకం విభాగంలో నాగ్‌పూర్ PIU ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *