కోలీవుడ్ లో నన్ను ఘోరంగా అవమానించారు : సూరి
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయట పెట్టాడు . నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి (Soori) ఒక పెద్ద హీరో చిత్రంలో నటిస్తున్నప్పుడు తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సంచలన ఘటన ఆయన మాటల్లోనే.
నన్ను ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే కాంబినేషన్ సీన్ అది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో, దర్శకుడు కలిసి మానిటర్‌లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి, రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి తొడగమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినప్పటికీ, దాన్ని లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్ పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని, తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నాను. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన, ఎప్పటికీ మర్చిపోలేని ఘటన ఇది అని అన్నాడు సూరి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నటుడు సూరి చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తమిళ చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసేలా చేశాయి.