గణేష్ చతుర్థి కోసం మార్గదర్శకాలు జారీ : సీపీ
హైదరాబాద్ : గణేష్ చతుర్థి కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. గణేష్ పందిళ్ల నిర్మాణం పటిష్టంగా ఉండేలా, విద్యుత్ వైరింగ్ సరిగ్గా ఉండేలా, శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించేలా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసేలా నిర్వాహకులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది గణేష్ చతుర్థి వేడుకలు, విగ్రహ నిమజ్జనం సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా చూడాలని, అన్ని పోలీస్ విభాగాలను అప్రమత్తంగా ఉండాలని సీపీ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. గణేష్ చతుర్థి వేడుకలు, విగ్రహ నిమజ్జన ఏర్పాట్ల దృష్ట్యా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సమగ్ర భద్రతా మార్గదర్శకాలు , కార్యాచరణ సన్నద్ధత చర్యలను ప్రకటించారు. నిర్వాహకులు తప్పనిసరిగా చూసుకోవాలని పేర్కొన్నారు. ఊరేగింపులు ఆమోదించబడిన మార్గాలు , సమయాలను అనుసరించాలని అన్నారు. పైనుంచి వెళ్లే విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
డీజే వ్యవస్థలను ఉపయోగించ కూడదని తెలిపింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రాంతాల్లో సిబ్బందిని మోహరిస్తామని ప్రకటించారు సీపీ. నిరంతరం గస్తీ నిర్వహిస్తామన్నారు. ఊరేగింపు మార్గాలను పర్యవేక్షిస్తామని, ట్రాఫిక్, జనసందోహ నియంత్రణ ఏర్పాట్లను సమన్వయం చేస్తుందన్నారు. వివిధ శాఖల సమన్వయంతో నిర్ణీత నిమజ్జన ప్రాంతాలలో లైటింగ్, బారికేడ్లు , క్రేన్‌లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. వేడుకల సమయంలో అత్యవసర స్పందన బృందాలు , ప్రత్యేక పోలీస్ సమన్వయ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిర్వాహకులందరూ సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, అవసరమైన భద్రతా ప్రమాణాలను నిర్వహించాలని , పోలీసు, పౌర అధికారుల సూచనలకు సహకరించాలని కోరారు సీపీ.