ట్రాన్స్ జెండర్ల దోపిడీ అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రాన్స్ జెండర్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్‌జెండర్ల దోపిడీ, భిక్షాటన దందాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు డీజీపీ. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిందని అంతే కాకుండా అలాగే హైడ్రాలో నియమించామని , వారిని సామాజిక జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి ప్రోత్సహించడం జరిగిందని చెప్పారు. అక్కడ ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చాలా బాగా పని చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. గృహ ప్రవేశాలు, ఇతర సందర్భాలలో ట్రాన్స్‌జెండర్ బృందాలు దోపిడీలకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్బంగా ఈ దురాచారాన్ని అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని తాను పోలీస్ కమిషనర్లందరికీ ఆదేశించినట్లు చెప్పారు.
ఈ మధ్యకాలంలో ట్రాన్స్‌జెండర్లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. నిజానికి హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు ఇలాంటి ఫిర్యాదులు పెరిగినప్పుడు, ట్రాన్స్‌జెండర్ల భిక్షాటన దందాలు, దోపిడీల బెడదను అరికట్టడానికి తాము ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందని చెప్పారు డీజీపీ సీవీ ఆనంద్. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మరోసారి చేపట్టాలని తాను సీపీలందరికీ తప్పకుండా ఆదేశించినట్లు తెలిపారు. అయితే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, అలాగే హైడ్రాలో నియమించి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడానికి ప్రోత్సహిస్తూ వస్తున్నామన్నారు.