‘హనుమాన్ అంశ్’ బ్లాక్‌బస్టర్ .. సీక్వెల్ పక్కా
హైదరాబాద్ : ఎవరూ ఊహించని రీతిలో హనుమాన్ అంశ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ విజయాన్ని నమోదు చేయడంతో దర్శకుడు సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు. కాగా కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలైనప్పటికీ, తమ ఆకట్టుకునే కథనంతో భారీ ప్రభావాన్ని చూపిస్తాయి. మౌలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’, ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’, నిఖిల్ ‘కార్తికేయ 2’ వంటి సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. ఇప్పుడు వాటి కోవలోకి ‘హనుమాన్ అంశ్’ చిత్రం కూడా 30 రోజుల్లోనే 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ జాబితాలో చేరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా మొదటి రోజు 300 స్క్రీన్‌లలో విడుదలైనప్పటికీ, ఆదరణ లేకపోవడంతో తర్వాత 30 స్క్రీన్‌లకు పడిపోయింది.
కానీ ఇప్పుడు, సానుకూల స్పందన కారణంగా స్క్రీన్‌ల సంఖ్య మళ్లీ 1500కి పెరిగింది. సినిమాకు లభించిన ఈ భారీ స్పందనను చూసిన తర్వాత, 21 ఏళ్ల నిర్మాత అనుప్రియ నగర్ సీక్వెల్‌ను ప్రకటించారు. ఆమె ఇలా అన్నారు మేము మా ప్రేక్షకులను నిరాశపరచమని పేర్కొన్నారు. బాక్సాఫీస్ పరంగా మహారాజ్ జీ (నీమ్ కరోలీ బాబా) మాకు అపారమైన విజయాన్ని ప్రసాదించారు, కాబట్టి దీనికి సీక్వెల్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు అని అన్నారు. ‘సాక్‌నిల్క్’ నివేదిక ప్రకారం ఈ సినిమా 31 రోజుల్లో రూ. 122 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.