నందూస్ వరల్డ్ ఫేమ్ నందన అరెస్ట్

హైద‌రాబాద్ : ప్రముఖ యూట్యూబ‌ర్ నందూస్ వ‌ర‌ల్డ్ నిర్వాహకులు నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ల‌ను అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రిపై పై గత జూన్ నెలలో మొదట కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై వచ్చిన మోసం ఆరోపణలు సంచలనంగా మారాయి. వీసా రెన్యువ‌ల్ పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేసి మోసం చేశార‌ని బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు ఇబ్ర‌హీంప‌ట్నం పీఎస్‌లో యూట్యూబ‌ర్ నందూస్ వ‌ర‌ల్డ్‌, ఆమె భ‌ర్త జాగర్లమూడి మధుకర్, ఆయన తండ్రి మోహన్ రావు పై కూడా కేసు నమోదు చేశారు .

గుంటూరుకు చెందిన ఈ దంపతులు యూకే (లండన్) లో నివసిస్తున్నారు. రమానందన ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని చెప్పి కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్‌లో చదువుకునే రోజుల్లో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది. లండన్‌లో ఉద్యోగం చేసి భారత్‌కు వచ్చిన శివ క్రాంతి కుమార్.. వీసా రెన్యూవల్, భార్యకు ఉద్యోగం కోసం సీఓస్ ఇప్పిస్తామని చెప్పిన మధుకర్‌ను ఆశ్రయించారు. దీని కోసం రూ.15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించగా,2023లో శివ క్రాంతి కుమార్ నిందితులు తెలిపిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు.

బాధితుడు శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబరులోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ కేసులో మధుకర్ (A1), రమానందన (A2), మోహన్‌రావు (A3)గా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు తర్వాత పలువురు బాధితులు తాము కూడా ఇదే తరహాలో నందన దంపతులకు డబ్బులు ఇచ్చి మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నందనను పోలీసులు అరెస్ట్ చేసారు.

  • Related Posts

    బాబా రామ్ దేవ్ అనుచ‌రుడు బాల‌కృష్ణ‌కు బిగ్ రిలీఫ్

    డెహ్రాడూన్ : ప్ర‌ముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన ప‌తంజ‌లి వ్యాపార సంస్థ‌ల సీఈఓగా ఉన్న బాల‌కృష్ణ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై గ‌తంలో నకిలీ పత్రాలకు సంబంధించి కేసు న‌మోదైంది. తాజాగా ఈ కేసులో…

    బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం : స‌విత

    అమ‌రావ‌తి : బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించామని, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు . బీసీల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *