బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం : స‌విత

అమ‌రావ‌తి : బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించామని, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు . బీసీల రాజకీయ సాధికారతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్ల కోసం ముందుకు సాగు తున్నామన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందన్నారు. దాని వల్ల 16,800 రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దిడానికి కృషి చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 138 బీసీ కులాల ఆత్మగౌరవానికి, రక్షణకు పెద్దపీట వేస్తూ, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్-2026 తీసుకు రావడానికి చర్యలు చేపట్టామని అన్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, 50 ఏళ్లు పైబడిన 1,30,796 మంది మత్స్యకారులకు రూ.505 కోట్ల మేర పింఛన్లు అందించామని తెలిపారు. వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. చేనేత కార్మికులకు కూడా అండగా నిలిచామని, 50 ఏళ్లు పైబడిన 85,940 మంది చేనేత కార్మికులకు రూ.844 కోట్ల పింఛన్లు అందించామని తెలిపారు. 62,541 నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నేతన్నల సేవలో పథకం కింద మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

దివ్యాంగుల సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం ముందుందని మంత్రి సవిత తెలిపారు. దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచామన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం కోసం 1,750 మందికి మూడు చక్రాల వాహనాలు అందించామని, ఇందుకోసం రూ.18.47 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. రైతు, మహిళ, విద్యార్థి, బీసీ, మత్స్యకారుడు, చేనేత కార్మికుడు, దివ్యాంగుడు.. ఇలా ప్రతి వర్గానికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా గణాంకాల్లో చూపిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

  • Related Posts

    నందూస్ వరల్డ్ ఫేమ్ నందన అరెస్ట్

    హైద‌రాబాద్ : ప్రముఖ యూట్యూబ‌ర్ నందూస్ వ‌ర‌ల్డ్ నిర్వాహకులు నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ల‌ను అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రిపై పై గత జూన్ నెలలో మొదట కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.ప్రముఖ…

    ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు

    విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. 5 అంశాలే త‌మ పార్టీ మేనిఫెస్టో అని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *